రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వ అధికారులకు వచ్చినా పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలంలో వైసీపీకి చెందిన ముఖ్య మండల ప్రజా ప్రతినిధి ఇసుక దందాకు తెరపడలేదు. పెద్దగంజాంలో సోమవారం రాత్రి ఆ నేత జెసిబితో ఇసుక తవ్వించి మూడు లారీలలో లోడ్ చేయడాన్ని గమనించిన గ్రామస్తులు అడ్డుకున్నారు. వారే జెసిబిని, ఆ మూడు లారీలను చినగంజాం స్టేషన్ కు తరలించి పోలీసులకు అప్పగించారు. అక్కడే ఇసుక డంపులు ఉన్న సమాచారాన్ని కూడా అందజేశారు.