పెద్దారవీడు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బోడిరెడ్డి పల్లి గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో వెంకటరెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. చికిత్స పొందుతున్న వెంకట రెడ్డి శనివారం మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.