రాచర్ల: మిరప పొలాలను పరిశీలించిన అధికారిణి
రాచర్లలోని రామాపురం గ్రామంలో శుక్రవారం ఉద్యానవన శాఖ అధికారిణి విష్ణు ప్రియ మిరప పొలాలను పరిశీలించారు. ఇటీవల వర్షాలు కురవడం వల్ల మిరప పంటకు వేరు కుళ్ళు వచ్చే అవకాశం ఉందని అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు ఆమె వివరించి చెప్పారు. తేమ ఆరడానికి ఎకరాకి కేజీ 30 యూరియా కేజీ 15 పొటాష్ ను చల్లాలని రైతులకు తెలిపారు. సందేహాలకు మీ స్థానిక రైతు సేవ కేంద్రాలను సంప్రదించాలని విష్ణు ప్రియ రైతులకు తెలిపారు.