రాచర్ల: అక్రమణాలను అడ్డుకున్న అధికారులు
రాచర్ల మండలం ఎడవల్లి గ్రామ సమీపంలోని చెరువులో ఆక్రమణలను స్థానిక రెవెన్యూ అధికారులు ఆదివారం అడ్డుకున్నారు. ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ ద్వారా చెరువులోని భూమిని చదును చేసుకుంటున్నా విషయాన్ని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న రెవెన్యూ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు ట్రాక్టర్ ని స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పమన్నారు.