అవినీతి చేసిన వారి భరతం పడతాం
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుముల వీడు గ్రామంలో సోమవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అవినీతికి పాల్పడ్డ వారి భరతం పడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తుందని, ఇప్పటికే హామీలు కొన్ని నెరవేర్చామని ఎమ్మెల్యే చెప్పారు.