రాచేర్ల మండలం జేపీ. చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అడవుల్లో ఉన్న నెమలి గుండ్లం వరదలతో పోటెత్తుతుంది. నల్లమల అడవుల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గుండ్ల బ్రహ్మేశ్వరం నుండి గుండ్లకమ్మ నది ప్రవహిస్తూ నెమలిగుండం చేరుకుంటుంది. నెమలి గుండం నిండు కుండలా మారడంతో ఆలయ పరిసరాలు కొత్త శోభతో కళకళలాడుతున్నాయి. అక్కడి నుండి ప్రవాహం రామన్న కతువ మీదుగా కంభం చెరువు, గుండ్లకమ్మకు చేరుకుంటుంది.