40 మంది భక్తులను రక్షించాము: కలెక్టర్

64చూసినవారు
40 మంది భక్తులను రక్షించాము: కలెక్టర్
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటికి రావాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. రాచర్ల మండలం జెసి చెరువు నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానానికి వెళ్లిన భక్తులు వాగు ఉధృతితో కొట్టుకుపోకుండా అధికారులను అప్రమత్తం చేసి 40 మందిని రక్షించామన్నారు. పోలీసు, రెవెన్యూ, అటవీశాఖ సమన్వయంతో పనిచేసినందుకు కలెక్టర్ అభినందించారు.

సంబంధిత పోస్ట్