ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వులపాడు పంచాయతీ పరిధిలో ఆటో బోల్తా పడి పలువురికి గాయాలైన ఘటన బుధవారం 565 హైవే రోడ్డుపై చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కొనకనమెట్ల కూలీ పనికి వెళ్లి తిరిగి రాయవరం వెళ్ళే సమయంలో ఆటో టైర్ పగిలి నవోదయ 2 సమీపంలో బోల్తా కొట్టినట్లు స్థానికులు తెలిపారు. గాయాలైన వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.