AP: వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్ పేరు చూస్తూనే కూటమి ప్రభుత్వం భయపడుతుందని, అందుకే అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చారని, నేడు విశాఖలోని స్టేడియంకు ఉన్నపేరును కూడా తొలగించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ గురువారం వైఎస్‌ఆర్ పార్టీ స్టేడియం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతుందని తెలిపారు.