త్రిపురాంతకం: వరద బాధితులకు భారీ విరాళాలు
విజయవాడ వరద బాధితులకు త్రిపురాంతకం టిడిపి నాయకులు కార్యకర్తలు అండగా నిలిచారు. వరదల్లో సర్వస్వం కోల్పోయిన వరద బాధితుల కొరకు మండలంలోని పలువురు టిడిపి శ్రేణులు రూ. 3, 37, 700 నగుదును నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుకు టిడిపి కార్యాలయంలో సోమవారం అందించారు. అందించిన విరాళాలని సీఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తామని అన్నారు. విరాళాలు ఇచ్చిన కార్యకర్తలను నాయకులను ఎరిక్షన్ బాబు అభినందించారు.