రేపు యర్రగొండపాలెంలో జరిగే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి

60చూసినవారు
రేపు యర్రగొండపాలెంలో జరిగే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం 9 గంటలకు యర్రగొండపాలెం పోలీస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఎస్సై పి. చౌడయ్య ఆదివారం తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. మండలంలోని యువత, రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలనీ కోరారు.

సంబంధిత పోస్ట్