పెద్దారవీడు మండలం మద్దకట్ల గ్రామ సమీపంలోని పొలాలలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి తన పొలంలో కేబుల్ వైరు, పైపులు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల తన పొలంలో ఉన్న మోటారు రిపేరు రావడంతో మోటర్ ను బయటకు తీసి రిపేర్ కి ఇవ్వగా గుర్తుతెలియని వ్యక్తులు కేబుల్ వైరు పైపులు చోరీ చేశారని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.