నేటినుండి ఐదు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేయనుందని ఎంపిడివో మరియదాసు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం వలంటీర్, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు ఇంటింటి సందర్శన, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు సర్వే రూపంలో రెండు దశల ప్రక్రియ ప్రారంభించారని చెప్పారు.