యర్రగొండపాలెం: కానిస్టేబుల్ ను అభినందించిన ఎస్సై, సీఐ

83చూసినవారు
యర్రగొండపాలెం: కానిస్టేబుల్ ను అభినందించిన ఎస్సై, సీఐ
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాషా వలి ఉత్తమ ప్రతిభ రివార్డుకు ఎంపికయ్యాడు. విధి నిర్వహణలో అంకితభావం ప్రదర్శిస్తూ రివార్డుకు ఎంపికైన బాషాను సీఐ ప్రభాకర్ రావు, ఎస్సై చౌడయ్య అభినందించారు. రెండు హత్య కేసులలో ముద్దాయిలను గుర్తించడంలో కానిస్టేబుల్ కీలకంగా వ్యవహరించినట్లుగా సీఐ ప్రభాకర్ రావు తెలిపారు. సోమవారం రివార్డును కానిస్టేబుల్ కు సీఐ అందించారు.

సంబంధిత పోస్ట్