యర్రగొండపాలెం: ప్రజా దర్బార్ లో ప్రజా సమస్యల వెల్లువ
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్థానిక టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని పలువురు తమ ప్రాంతాల్లోని తమ భూముల సమస్యలను తెలుపుతూ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుకు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజలు తెలిపిన సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.