AP: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా దీపావళికి ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే గ్యాస్ బుకింగ్‌లో ఏమైనా సమస్యలు ఉంటే గ్రామ స్థాయిలోని సచివాలయాల్లో తెలియజేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తారని అధికారులు చెబుతున్నారు.