ఏపీలో కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన నేపథ్యంలో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వంద రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించే విధంగా 'ఇది మంచి ప్రభుత్వం' అనే పేరుతో ఆరు రోజుల పాటు ప్రతి గడపకు వెళ్లేలా కార్యక్రమాలు చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలో నేడు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు.