ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విడదల రజిని ఫైర్ అయ్యారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 'ఆడబిడ్డ నిధి, దీపం పథకం, తల్లికి వందనం, అన్నదాత పథకాలకు ఎన్ని కోట్లు ఇచ్చావ్? యువతకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావ్? ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తానంటున్నావు. నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిన్ను నిలదీస్తూ పోస్టులు పెడతాం' అని రజినీ అన్నారు.