ఏపీలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బడ్జెట్లో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రూ.4,500 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద రైతులకు రూ.20 వేలు అందించనుంది. జనవరి నుంచి ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18న జరగనున్న కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.