రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన మహిళ.. అసలేమైంది?

53చూసినవారు
రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన మహిళ.. అసలేమైంది?
ఏపీలో వివాహిత ఆత్మహత్య సంచలన రేపుతోంది. కాకినాడ జిల్లా చదలవాడకు చెందిన దివ్య అనే గర్భవతి గొల్లప్రోలు మండలం చేబ్రోలు సమీపంలో భోగీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దివ్యకు గొల్లప్రోలుకు చెందిన తొగర రమేష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన తొలినాళ్ల నుంచే అత్తింట్లో ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఆ ఒత్తిడితోనే దివ్య ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే దివ్య మృతి మిస్టరీ వీడనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్