ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘాల ప్రతినిధులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభవార్త చెప్పారు. వారితో సమావేశం నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.750 కోట్లు విడుదల కాబోతున్నాయని తెలిపారు. ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికే వినియోగించుకోవాలని పవన్ సూచించారు. పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించమని తేల్చి చెప్పారు.