ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి

1057చూసినవారు
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై ఇటీవల కాలంలో తరచూ దాడులు పెరిగిపోతున్నాయి. కొవ్వూరు నుంచి వస్తున్న బస్సు సాంకేతిక కారణాలతో జంగారెడ్డిగూడెం అగ్నిమాపక కేంద్రం వద్ద నిలిచిపోయింది. డిపోకు సమాచారం ఇచ్చిన డ్రైవర్ పొలిమాటి బాబు సిబ్బింది కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు అపరిచితులు డ్రైవర్ వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించారు. ఇద్దరు దొంగలు అతడిని పట్టుకోగా మరో వ్యక్తి డ్రైవర్ తలపై రాయితో కొట్టారు. తీవ్రగాయలైన డ్రైవర్ వద్ద నుంచి ఫోన్ తీసుకుని పరారయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్