పాకిస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెళ్లెళ్లు తమ తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. పంజాబ్ ప్రావిన్స్‌లో గుజ్రాన్‌వాలాలో ఈ ఘటన జరిగింది. తండ్రి తమపై చేస్తున్న అఘాయిత్యాలకు పరిష్కారంగా తమ తండ్రిని చంపేయాలని వారిద్దరు అనుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ తీసుకుని, నిద్రిస్తున్న తండ్రిపై పోసి నిప్పంటించారని పోలీసులు తెలిపారు. అతడు చికిత్స పొందుతూ మరణించగా, ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.