ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ!

57చూసినవారు
ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ ఫిబ్రవరిలో ప్యారిస్‌లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. భారతదేశాన్ని చాలా ముఖ్యమైన దేశంగా ఫ్రాన్స్ అభివర్ణించింది. ప్రధాని అక్కడకు వెళ్తే భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య బంధం మరింత బలపడనుంది. రెండు భారీ రక్షణ ఒప్పందాలు ఖరారు కానున్నట్టు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్