మనలో చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కాఫీ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అయితే కాఫీ ఏం టైంలో తాగితే మంచిదో తెలుసా? ఉదయం పూట. మార్నింగ్ కాఫీ తాగే వారిలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 31 శాతం తగ్గుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అదే సమయంలో ఇతర కారణాలవల్ల మరణించే ప్రమాదం కూడా 16% తగ్గిందని ఓ అధ్యయనంలో తేలినట్లు పేర్కొంటున్నారు.