ఏపీలో ఉపాధి అవకాశాలు కరువు: నారా బ్రాహ్మణి

50చూసినవారు
ఏపీలో ఉపాధి అవకాశాలు కరువు: నారా బ్రాహ్మణి
ఏపీకి రాజధాని లేక యువతకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. నారా బ్రాహ్మిణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వసతుల లేమితో రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని ఆమె అన్నారు. ఇప్పుడున్న సమస్యలకు ఒక్కటే పరిష్కారమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్