ఏపీలో ఇవాళ స్కూల్ మేనేజ్‌మెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాలను పాఠశాలల్లో ప్రదర్శించారు. ఎన్నిక విధానం చేతులు ఎత్తడం లేదా చెప్పడం ద్వారా ఉంటుంది. ఎన్నికైన మొత్తం 15 మంది సభ్యుల్లో ఒకరిని ఛైర్మన్‌గా, మరొకరిని వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఇవాళే ప్రమాణస్వీకారం చేసి తొలి కమిటీ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులనూ నియమిస్తారు.