దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం 78,707.37 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకుని 78,472.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 25.80 పాయింట్ల నష్టంతో 23,727.65 వద్ద స్థిరపడింది. ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో కాస్త కొనుగోళ్ల మద్దతు లభించింది. బుధవారం క్రిస్మస్ సందర్భంగా సెలవు కావడంతో మళ్లీ గురువారమే మార్కెట్లు తెరుచుకోనున్నాయి.