ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీలో మరో 2 వేల బస్సులతో పాటు సిబ్బంది కావాలని ప్రభుత్వం ఆర్టీసీని కోరిందని పేర్కొన్నారు. ఈ నియామకాలు అన్ని పూర్తి చేసుకుని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమలు చేస్తామని నారాయణ స్పష్టం చేశారు.