AP: కో-వర్కింగ్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలన్నారు. వారి కోసం వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. చదువుకున్న మహిళలు గృహిణిలుగా మిగిలిపోకూడదని... వారికి అవకాశాలు కల్పించాలని సీఎం అభిప్రాయపడ్డారు. వర్క్‌ఫ్రం హోమ్, కో-వర్కింగ్ సెంటర్లతో మహిళలకు విస్తృతంగా అవకాశాలు లభిస్తాయన్నారు.