కర్ణాటకలోని కలబురగిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన కొడుకును స్కూల్ బస్సులో ఎక్కించే క్రమంలో అక్కడే తెగిపడి ఉన్న విద్యుత్ వైర్‌ను తొక్కడంతో షాక్ తగిలింది. తల్లికి ఏదో అయిందని పట్టుకోబోగా చిన్నారికి కూడా షాక్ తగలగా చుట్టుపక్కల వారు వారిని రక్షించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, కొడుకు చికిత్స పొందుతున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.