ఇవాళ ఏపీలో తీవ్ర వడగాల్పులు

81చూసినవారు
ఇవాళ ఏపీలో తీవ్ర వడగాల్పులు
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 222 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరంలో 24, మన్యంలో 11, విశాఖలో 1, అనకాపల్లిలో 7, కాకినాడలో 4, తూర్పుగోదావరిలో 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్