ఈ నెల 9న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

70చూసినవారు
ఈ నెల 9న వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు
ఏపీలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 9న ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కళ్యాణోత్సవం, శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం పుష్ప పల్లకీలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, కుంకుమార్చన, ఊంజల్ సేవను టీటీడీ రద్దు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్