‘ఆస్తుల్లో నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న వైఎస్ఆర్ మ్యాండేట్ అబద్ధమని మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా?’ అని విజయసాయిరెడ్డిని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మీరు చదివింది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేస్తారా? అని నిలదీశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. సొంత ప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు కాదా జగన్? అని షర్మిల మండిపడ్డారు.