AP: పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బావిలో స్నానానికి దిగి ఇద్దరు శివ మాలధారులు మృతి చెందారు. ఈ ఘటన వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. శివ మాల వేసుకున్న మొత్తం ముగ్గురు స్వాములు స్నానం చేయడం కోసమని దిగుడు బావిలోకి దిగారు. ఈ క్రమంలోనే స్వాములు గల్లంతు కాగా.. ప్రమాదవశాత్తు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జిడ్డు మల్లికార్జున(22), కామసాని రామకృష్ణ(27) ఉన్నారు.