విషాదం.. ఎలుకల మందు స్ప్రే చేయడంతో ఇద్దరు పిల్లలు మృతి

59చూసినవారు
విషాదం.. ఎలుకల మందు స్ప్రే చేయడంతో ఇద్దరు పిల్లలు మృతి
తమిళనాడులో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మనన్ చెర్రికి చెందిన బ్యాంక్ మేనేజర్ గిరిధరన్, భార్య పవిత్ర, కూతురు, కుమార్తెతో కలిసి ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. అయితే తన అపార్ట్‌మెంట్‌లో ఎలుకలు ఉన్నాయని.. కెమికల్ స్ప్రే చేయించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి సమయంలో ఏసీ ద్వారా ఆ కెమికల్ ఇళ్లంతా వ్యాపించడంతో ఇద్దరు పిల్లలు మృతిచెందగా.. భార్యభర్తలిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్