వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. క్రికెట్ బెట్టింగ్ విషయంలో వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ నేత నాగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో నాగేంద్ర క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నాగేంద్రతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.