చంద్రబాబు ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సబ్సిడీపై వ్యవసాయ సాగు పరికరాలు అందజేయనున్నట్లు తెలిపింది. 50 శాతం రాయితీతో వ్యవసాయ పరికరాలు అందించనున్నట్లు పేర్కొంది. మార్చి 26వ తేదీలోపు సమీప రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలని సూచించింది. వ్యవసాయ సహాయకుడి సహకారంతో తమ వివరాలను నమోదు చేసుకొని సబ్సిడీ వ్యవసాయ పరికరాలు పొందవచ్చని తెలిపింది.