నెల్లూరు జిల్లా సిరిపురం రైల్వే గేటు వద్ద ట్రైన్‌లో ఒక్కసారిగా పొగలు కమ్ముకున్నాయి. నాగోన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే లోకో పైలట్ రైలును నిలిపివేశారు. బ్రేక్ డౌన్ కారణంగానే పొగలు సంభవించాయని నిర్థారించారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.