కోల్కతా ఆర్జీకార్ ఆస్పత్రి ఘటనపై సీబీఐ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన దారుణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్ ఇంటితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సైతం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం 15 ప్రాంతాల్లో సందీష్ ఘోష్ పాటు ఇతర కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.