సి.ఎం.ఏ ఫలితాలలో ఆల్ ఇండియా 1వ ర్యాంకు సాధించిన మాస్టర్ మైండ్స్

20718చూసినవారు
సి.ఎం.ఏ ఫలితాలలో ఆల్ ఇండియా 1వ ర్యాంకు సాధించిన మాస్టర్ మైండ్స్
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ఇటీవల ప్రకటించిన CMA ఫలితాలలో ప్రముఖ విద్యాసంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అఖిల భారత స్థాయిలో ప్రభంజనం సృష్టించారు. సి.ఎం.ఏ ఫైనల్ లో మొదటి 10 ర్యాంకులలో ఆల్ ఇండియా 1వ ర్యాంకు, 3 వ ర్యాంకు, 8వ ర్యాంకు సాధించిన ముగ్గురు విదార్థులతో పాటు ఆల్ ఇండియా 50 ర్యాంకులలోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు 14 మంది ఉన్నారని మాస్టర్మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ CA మోహన్ తెలియజేసారు. సి.ఎం.ఏ ఇంటర్ లో మొదటి 50 ర్యాంకులలో ఆల్ ఇండియా 3వ ర్యాంకు (సౌత్ ఇండియా ఫస్ట్), 9 వ ర్యాంకుతో పాటు ఇతర ర్యాంకులు సాధించిన విద్యార్థులు 25 మంది ఉన్నారన్నారు. సి.ఎం.ఏ ఫైనల్ మరియు సి.ఎం.ఏ ఇంటర్ ఫలితాలలో ఆల్ ఇండియా మొదటి 10 ర్యాంకులలో 5 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారని తెలిపారు. సి.ఎం.ఏ ఫైనల్ మరియు సి.ఎం.ఏ ఇంటర్ ఫలితాలలో ఆల్ ఇండియా మొదటి 50 ర్యాంకులలో 39 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్