మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ విద్యార్ధి తన టీసీ, సర్టిఫికెట్స్ తీసుకునేందుకు స్కూల్ కి వెళ్లాడు. అయితే స్కూల్ ఫీజుల విషయంలో విద్యార్థికి, మహిళా ప్రిన్సిపాల్ మధ్య జరిగింది. మొత్తం ఫీజు చెల్లిస్తేనే మార్కు పత్రం ఇస్తామని ప్రిన్సిపాల్ అన్నారు. దీంతో విద్యార్థికి, ప్రిన్సిపాల్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమె విద్యార్థిని కొట్టింది. కోపోద్రిక్తుడైన విద్యార్థి కూడా ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.