రాష్ట్రవ్యాప్తంగా ‘భారత్ నెట్’ ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 35 లక్షల సీపీఈ బాక్సులు సరఫరా చేయాలని కోరింది. ఈ ప్రాజెక్టు రెండో దశలో ఖర్చు చేసిన రూ.650 కోట్లను ఏపీకి చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా 9.7 లక్షల గృహాలు, 1,978 ఆరోగ్య కేంద్రాలు, 6,200 స్కూళ్లు, 5,800 రైతు కేంద్రాలు, 9,104 ప్రభుత్వ కార్యాలయాలు, 11,254 పంచాయతీలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.