విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని రైల్వే శాఖకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చినగదిలి పరిధి ముడసర్లోవ వద్ద 52 ఎకరాల భూములను జీవీఎంసీ, రైల్వే అధికారులు పరిశీలించారు. ఈ స్థలంపై కొంత వివాదం ఉండగా.. క్లియర్ టైటిల్‌తో పూర్తి హక్కులతో ఇవ్వాలని రైల్వే కోరుతోంది.