స్పీకర్ తమ్మినేనికి విశాఖలో చికిత్స

73చూసినవారు
స్పీకర్ తమ్మినేనికి విశాఖలో చికిత్స
గురువారం రాత్రి అస్వస్థతకు గురైన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను విశాఖలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. తొలుత శ్రీకాకుళంలోని ఓ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం విశాఖపట్నానికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్