సరిగా ఉడకని పంది మాంసం తినడంతో ఇన్ఫెక్షన్ తో నిండిపోయిన రోగి కాళ్లు, సీటీ స్కాన్ లో గుర్తింపు

1012చూసినవారు
సరిగా ఉడకని పంది మాంసం తినడంతో ఇన్ఫెక్షన్ తో నిండిపోయిన రోగి కాళ్లు, సీటీ స్కాన్ లో గుర్తింపు
పరాన్నజీవి ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఓ రోగి కాలు కండరాల కణజాలాన్ని బహిర్గతం చేసే సీటీ స్కాన్ చిత్రాన్ని యుఎస్‌కు చెందిన ఒక వైద్యుడు 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. 'సిస్టిసెర్కోసిస్' అనే ఈ ఇన్ఫెక్షన్ సరిగ్గా ఉడకని పంది మాంసం తినడం వల్ల వస్తుందన్నారు. "పోర్క్ టేప్ వార్మ్ గుడ్లు దేహంలోకి చేరిన తర్వాత లార్వాలను విడుదల చేస్తాయి. ఇవి పేగు గోడలోకి చొచ్చుకుపోయి, రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి శరీరమంతా వ్యాపిస్తాయి" అని డాక్టర్ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్