ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను నియమించింది. రాష్ట్రస్థాయిలో ఏపీ సీఎస్ ఛైర్మన్‌గా, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్‌గా కమిటీలు వేసింది. రాష్ట్ర స్థాయి కమిటీలో 21 మంది, జిల్లా స్థాయి కమిటీలో 17 మంది సభ్యులు ఉంటారు. ధరల స్థిరీకరణకు కావాల్సిన అంశాలపై ప్రభుత్వానికి కమిటీలు సూచించనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.