గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బిజెపి ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. బుధవారం ఆయన పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పల్లె ప్రగతి పేరు మీద యాబై శాతం నిధులు, భారత ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులను గ్రామ పంచాయతీలకు నేరుగా పంపిస్తే గ్రామాలు అభివృద్ది చెందాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె ప్రగతి నిధులను నిలిపివేసి పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.