సంగం మండల కేంద్రంలోని నిమ్మతోపు సెంటర్ ఎస్సీ కాలనీలో మాతా పరమేశ్వరి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో భాగంగా అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారిని పరిమళ పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం గ్రామ పురవీధులలో ఉత్సవం వైభవంగా సాగింది. భక్తులు అమ్మవారి నైవేద్యాలు ల్ సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.