కందుకూరు మున్సిపల్ పరిధిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ అనూష పరిశీలించారు. గాయత్రీ నగర్, శారదా నిలయం, మంగళ పాలెం, ప్రశాంతి కాలనీ, శ్రీనగర్ కాలనీ మొదలైన ఏరియాల్లో యాంటి లార్వా బ్లీచింగ్ పనులను అనూష పరిశీలించారు. అనంతరం స్థానికులతో ఆమె మాట్లాడుతూ. పారిశుద్ధ్య పనులపై పలు సూచనలు సలహాలు చేశారు. చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సమస్యలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.